ధర్పల్లి లో షార్ట్ సర్క్యూట్ తో రోడ్డున పడ్డ రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ…..

On: Sunday, September 14, 2025 5:23 PM

A9 న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్ రూరల్:

ధర్పల్లి గ్రామంలోని గోసంగి కాలనీలో రెండు నివాస గృహాలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయి రెండు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. విషయం తెలిసి ధర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ సంఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చి కుటుంబానికి 25 కిలోల బియ్యము, పప్పులు, నూనెలు ఇతర వంట సామాను మరియు బ్లాంకెట్ లు టవల్స్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెలిమెల చిన్నారెడ్డి,చెలిమెల శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రిక్క దినకర్, బొక్కల బాలయ్య, రాకేష్, చక్రపాణి ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

13 Mar 2026

Leave a Comment