ఆలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ – 11 మందికి రూ.3 లక్షల సహాయం…..

On: Wednesday, January 14, 2026 1:19 PM

 

ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి కృషితో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. భారతీయ జనతా పార్టీ ఆలూరు మండల శాఖ ఆధ్వర్యంలో సుమారు 11 మంది అర్హులైన లబ్ధిదారులకు దాదాపు మూడు లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సూర్య శ్రీకాంత్ గారు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొత్తూరు గిరీష్ గారు, మండల జనరల్ సెక్రటరీలు హర్ష హరీష్ గారు, జిల్లా ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ సుభాష్ గారు, మండల ఓబీసీ అధ్యక్షులు నాడిశెరం మల్లయ్య , మండల ఉపాధ్యక్షులు డాక్టర్ అరుణ్ గారు, బీజేవైఎం యువ నాయకులు శ్రీ నాగేందర్ గారు, అలాగే శ్రీనివాసు, మల్లయ్య, రామకృష్ణ, గంగాధర్ (ఎల్ఐసీ) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా తక్షణ సహాయం అందించడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సమస్త ఆలూరు బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.

05 Feb 2026

Leave a Comment