డిప్లొమోను ఇంటర్‌తో సమానంగా పరిగణించాలి: హైకోర్టు.

On: Sunday, July 6, 2025 1:48 PM

 

 

స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (పాలిటెక్నిక్‌) డిప్లొమో కోర్సు ,ఇంటర్మీడియట్‌తో సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ డిప్లొమో పూర్తి చేసిన అభ్యర్థులను ఇంటర్‌ అర్హతగా నిర్ణయించిన కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించాలని ఆదేశించింది. ఇంటర్‌ అర్హతగా ఉన్న ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ డిప్లొమో కోర్సు (డీఈఈసెట్‌-2025) చేసేందుకు అనుమతించడం లేదంటూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన హరీశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2001లో జారీచేసిన జీవో 112 ప్రకారం పాలిటెక్నిక్‌ డిప్లొమోను ఇంటర్‌కు సమానంగా గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. ఏకీభవించిన హైకోర్టు ఆయనను కౌన్సెలింగ్‌కు అనుమతించి, అడ్మిషన్‌ ఇవ్వాలని ఆదేశించింది.

 

24 Jul 2025

Leave a Comment