A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు బుధవారం బార్ అసోసియేషన్ హాల్లో గోడ ప్రతులు (వాల్ పోస్టర్లు) విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది లోకా భూపతి రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ— రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంను తక్షణం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎన్నికలను వెంటనే నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
న్యాయవాద వృత్తికి భంగం కలగకుండా, వైద్యులకు ఉన్నట్లే న్యాయవాదులకు కూడా పూర్తి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.







