స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థల డెలివరీ ఏజెంట్లు ఇవాళ సమ్మె చేయనున్నారు. 1.5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని యూనియన్లు చెబుతున్నాయి. అయితే డెలివరీ బాయ్స్ ను కంపెనీలు బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. మళ్లీ పనిలోకి రాకుండా IDలు బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు వర్క్ కొనసాగించాలని కొన్ని కంపెనీలు సెలబ్రిటీలతో యాడ్స్ చేయించాయి.








