హైదరాబాద్:నవంబర్ 11
ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు బ్లాస్టింగ్ ఘటన సోమవారం సాయంత్రం తీవ్ర విషాదాన్ని నింపింది, ఈ ఘటనలో మృతుల సంఖ్య తాజాగా పెరిగింది, స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన కోల్పోయినట్లు మంగళవారం ఢిల్లీ పోలీసులకు తెలిపారు.
ఈ ఘటనలో ఇప్పటికే.. 9 మంది మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మరో 17 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఉగ్రవాద చ ర్యగా అనుమానిస్తున్నారు.
ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఆత్మా హుతి దాడిగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.. కారు పుల్వామాకు చెందిన డా.ఉమర్‌దిగా గుర్తించారు. నిన్న కారులో ఉన్నది డా.ఉమర్‌గా ప్రాథమికంగా నిర్ధారించారు. డా.ఉమర్ పుల్వామాకు చెందిన వ్యక్తి .. అని.. శ్రీనగర్‌లోని ఎండీ మెడిసిన్స్ కాలేజీ, జిఎంసి అనంతనాగ్‌లో పనిచేసినట్లు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం అల్ఫాలా ఫరీదాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.. గత నెలలో అమీర్ పేరుమీద వాహనాన్ని కొనుగోలు చేసిన డా.ఉమర్.. అదే వాహనాన్ని పేలుడుకోసం వాడినట్లు పేర్కొంటున్నా రు.ఢిల్లీ కారు పేలుడు కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి.
జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. అమీర్ రషీద్ మిర్ (27), ఉమర్ రషీద్ మిర్(30).. తారిఖ్ మాలిక్ (44) ను కశ్మీర్ వ్యాలీలో జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు మరో 13మంది అనుమానితులు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు.







