నిజామాబాద్, జూలై 30:
డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల నిరోధం కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ వారియర్స్‌కు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం బుధవారం పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ హాల్‌లో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ :
“సైబర్ నేరాలు రోజురోజుకీ మారుతున్న నూతన పద్ధతులతో జరగుతున్నాయి. ఫిషింగ్, వేరియంట్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాలు వంటి వాటిపై ప్రతి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. బాధితులకు తక్షణ న్యాయం చేయడం మాన కర్తవ్యం. ప్రతి కేసును బాధ్యతగా, సాంకేతికంగా వహించాలి,” సైబర్ సెల్‌ను బలోపేతం చేయాలి, ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ నేరాలపై నిపుణులు ఉండాలి, ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సైబర్ నేరాల నివేదికకు 1930 నంబర్ లేదా https://www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలియజేయాలి అని తెలిపారు.
2024 జనవరి 1 తేదీ నుండి 2025 జులై 29వ తేదీ వరకు 759 సైబర్ క్రైమ్ కేసులు నమోదయినట్లు తెలిపారు, మొత్తం రూపాయలు (3 కోట్ల 27 లక్షల 12,397.84 పైసలు) బాధితులకు కోర్టు ఆధ్వర్యంలో రిఫండ్ చేయడం జరిగిందని సిపి తెలిపారు.
తర్వాత నిజామాబాద్ సైబర్ వారియర్స్‌కు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ వారు అందించిన టీ షర్ట్ లను తీపి చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి డి.ఎస్.పి వై.వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ మహమ్మద్ ముఖిద్ పాషా, ఎస్‌ఐ ప్రవళిక, శ్రీనివాస్, శ్రీరామ్, సురేష్, నాగభూషణం, నరేష్, ప్రవీణ్, రాఘవేంద్ర, సుమలత, శృతి, రమ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.