A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి నుంచి సైబర్ మోసగాళ్లు క్రెడిట్ కార్డు పేరిట 2 లక్షలు రూపాయలు కాజేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. మాలపల్లికి చెందిన బాధిత వ్యక్తికి ఇటీవల క్రెడిట్ కార్డు వచ్చింది. ఈ కార్డును ఉపయోగించుకునేందుకు పిన్ నంబర్ కోసం ఆన్‌లైన్‌లో యత్నించగా ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి బాధితుడికి ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. దీంతో బాధితుడు వివరాలు నమోదు చేయడంతో అతడి బ్యాంక్ నుంచి 2 లక్షలు రూపాయలు కట్టయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.