శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద సందర్శకుల రద్దీ…..

On: Wednesday, August 20, 2025 7:03 PM

 

నిజామాబాద్ జిల్లా, ఆగస్ట్ 20:

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది. వరద నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆనకట్ట వద్దకు చేరుకున్న సందర్శకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఆనందంతో స్మృతులు బంధిస్తున్నారు.

బుధవారం నాడు అధికారులు 16 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. రెండు రోజుల క్రితం 39 గేట్లను తెరిచిన అధికారులు, ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రవాహాన్ని నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.

వర్షాకాలంలో ప్రాజెక్టు వద్ద వెలసే అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అయితే, అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

12 Mar 2026

Leave a Comment