A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అవినీతి నిరోధక శాఖ (ACB) సిబ్బంది మరోసారి గుత్తాధిపత్యం చూపించారు. మోటారు వాహన ఇన్స్పెక్టర్ గుర్రం వివేకానంద రెడ్డి (AO-1), అతని డ్రైవర్ నెల్లి తిరుపతి (A-2) లంచం కేసులో బుక్కయ్యారు.
₹25 వేల లంచం డిమాండ్ & స్వీకరణ.
ఆగస్టు 21న, వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్ పునరుద్ధరణ, లెర్నింగ్ లైసెన్స్ జారీ వంటి అధికార సహాయం పేరుతో ఫిర్యాదుదారుని నుంచి ₹25,000 లంచం డిమాండ్ చేసి, డ్రైవర్ ద్వారా స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆ మొత్తం ACB సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలింపు:
కేసులో నిందితులిద్దరినీ అరెస్టు చేసిన ACB అధికారులు, వారిని హైదరాబాద్ నాంపల్లి SPE & ACB కేసుల ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
ప్రజలకు ACB విజ్ఞప్తి:
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగిన సందర్భంలో ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని ACB విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా WhatsApp (9440446106), Facebook (Telangana ACB), X (@TelanganaACB) ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు హామీ ఇచ్చారు.






