*కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం.
*నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి.
ఎ9 న్యూస్ ,మాసాయిపేట, ( మెదక్ ) ఆగస్టు 1:
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో సాయంత్రం లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిని ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్, చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు భారీ ఎత్తున రావడం జరిగింది. అనంతరం రైతు శ్రీనివాస్ ఎమ్మెల్యేతో నాకు రుణమాఫీ కాలేదు, నేను ఎలా బ్రతకాలని ప్రాధేయపడుతూ ఎమ్మెల్యేతో తన బాధలు వ్యక్తపరిచారు. వెంటనే ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి స్పందించి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఎందు గురించి రుణమాఫీ కాలేదు తెల్ల కాగితంపై రాసి అధికారులకు అంద జేయాలని రైతు శ్రీనివాస్ కు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఒక రైతు ఎమ్మెల్యే కి రుణమాఫీ కాలేదు అని తన సమస్య చెబుతూ ఉంటే ఇదంత జీర్ణించుకోలేక ఎందరో రైతుల ఆవేదన పట్టని కాంగ్రెస్ నాయకులు ఆ సమస్య పక్కదారి పట్టించడానికి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రేవంతన్న అని నినాదాలు పోలీసుల ముందు రెండు పార్టీలు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇవ్వడం అనేది కాంగ్రెస్ వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నాం అని నర్సాపూర్ నియోజకవర్గ వాకిట సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తపరిచారు. అదేవిధంగా
రుణమాఫీ కానీ వాళ్ల దగ్గరికి వెళ్లి ఇలాగే స్లొగన్స్ ఇవ్వండి అప్పుడు తెలుస్తుంది. మీ అరుపులకు కేకలకు ఉన్న విలువ మీ నాయకుడి మండలంలో ఇదంతా జరిగితే మీకు కొంచమైనా బాధ్యత లేదా ఆ బాధ్యత మరిచి మరి స్లోగన్స్ ఇవ్వడం అనేది దారుణం ఇకనైనా ప్రజలకు మంచి చేయండి. సమస్యలు పరిష్కరించడం చేయండి. అని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు అనంతరం,
అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు. అది గుర్తుంచుకొని ప్రజలకు మంచి చేయండి. ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అని కాంగ్రెస్ నాయకుల పై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, కలెక్టర్ రాహుల్ రాజ్, తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి, తాసిల్దార్ జ్ఞాన జ్యోతి, బి ఆర్ ఎస్ నాయకులు మాసాయిపేట మండల అధ్యక్షుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి, బి ఆర్ఎస్ మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు, ఎర్ర దశరథ , దప్పు మహేష్, గుడ్డి రమేష్, ఎర్ర స్వామి, పలు గ్రామాల బి ఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.