A9 న్యూస్ ప్రతినిధి :
ఈరోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు జక్రాన్ పల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళల సంఘాలకి చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు, మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకు వెళ్ళడమే పార్టీ ముఖ్య లక్షణం అని పార్టీ నాయకులు చెప్పడం జరిగింది, అలాగే ముందు ఉన్న స్థానిక ఎలెక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ జక్కం బాల కిషన్, నిజామాబాద్ రూరల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ సొప్పరి వినోద్, మాజీ ఎంపీటీసీ రూపాల గంగా రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు గన్న లక్ష్మణ్, మైనార్టీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, జలం గాంధీ, జితేందర్ నాయక్, గన్న సూరి, మాడవేరి శంకర్, మహిళా సంఘ వివోలు, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ,జక్రాన్ పల్లి మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్నట్ట తిరుపతి.






