ఆర్మూర్‌లో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర హైలైట్…

On: Sunday, August 3, 2025 7:40 AM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ శనివారం మూడో రోజుకు చేరింది. మంత్రి సీతక్క మాట్లాడుతూ, “కాంగ్రెస్ అంటే పేదలకు నీడ, యువతకు ఉపాధి, మహిళలకు ఆర్థిక స్వావలంబన” అని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కానీ కేంద్రంలోని బీజేపీ దానిని అడ్డుకుంటుందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఆలూర్ రోడ్ నుంచి పెర్కిట్ చౌరస్తా వరకు 8 కి.మీ. నడిచి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. రైతుల రుణమాఫీ, ఉచిత విద్యుత్, ₹500 బోనస్ వంటి పథకాలపై చర్చ జరిగింది. ఉద్యోగులు ‘317 జీఓ’పై వినతిపత్రాలు అందజేశారు.

సభలో మహేశ్ గౌడ్, “నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, టెంపుల్ కారిడార్, డిచ్‌పల్లి విమానాశ్రయం వంటి అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, “పదేళ్లపాటు ప్రజాప్రతినిధిగా ఉన్నా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఆర్టీసీ స్థలంలో కాంప్లెక్స్ కట్టించుకున్నారని” ఆరోపించారు.

సభలో పలువురు జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

03 Aug 2025

Leave a Comment