ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జగన్నాథ్ నాగేంద్ర గారు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నేను పాలకుడిని కాదు… ప్రజల సేవకుడిని. ఒక్కసారి అవకాశం ఇస్తే వార్డును నందనవనంగా తీర్చిదిద్దుతాను” అని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, హామీలకే పరిమితం కాకుండా అమలులో నిజాయితీ చూపే రాజకీయాన్ని ప్రజలకు అందిస్తానని తెలిపారు. రైతుల కష్టాలు, యువత భవిష్యత్, మహిళల భద్రత, పేదల హక్కుల పరిరక్షణే తన బాధ్యత అని అన్నారు.
“కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలే కేంద్రబిందువు. చేతు గుర్తు అంటే నమ్మకం, భరోసా, ప్రజల పక్షాన నిలిచే శక్తి” అని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల ఆశీర్వాద బలంతో ముందుకు సాగుతానని తెలిపారు.
జగన్నాథ్ నాగేంద్ర గారు గతంలోనూ ప్రజల కష్టసుఖాలలో భాగస్వామిగా నిలిచి, సేవా భావంతో పనిచేశారని, అందుకే ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆయన గెలుపే 2వ వార్డు అభివృద్ధికి కొత్త మలుపు అవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. చేతు గుర్తుపై ఓటు వేసి జగన్నాథ్ నాగేంద్ర గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.








