దళిత మాదిగ కుటుంబ భూముల రక్షణకు ఎస్సీ ఎస్టీ కమిషన్‌కి ఫిర్యాదు….

On: Sunday, July 6, 2025 12:52 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, జూలై 6:

ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్‌లో గత 56 సంవత్సరాలుగా నివసిస్తున్న దళిత మాదిగ కుటుంబాలు ప్రభుత్వ అసైన్మెంట్ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కన్న కి ఫిర్యాదు చేశారు.

ఇందారపు నరసయ్య మాదిగ, ఇందారపు దుబ్బయ్య మాదిగ, ఇందారపు రాజు మాదిగ, వినోద్ మాదిగ, గోపి మాదిగలు. ఈ కుటుంబాలు సర్వే నెం. 401/ఎలోని ప్లాట్ నెం.157లో 1971లో ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూమిలో నివసిస్తున్నారు. తండ్రి రాజయ్య మాదిగ పేరున ఇచ్చిన ఈ భూమిని కొంతమంది ప్రబలులైన ఖందేశ్ శ్రీనివాస్, నరేందర్, సత్యం, సుదర్శన్‌లు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు.

అన్యాయంగా దాడులు, బెదిరింపులు చేస్తున్నారు. అంటూ భూమిని కబ్జా చేయాలని ఖందేశ్ రామయ్య వారసులు బాధితులను ఫిజికల్‌గా దాడి చేసి, మాదిగ లంజాకొడుకులారా అంటూ దుర్భాషలు వాడారని, కర్రలతో కొట్టి ఊరుంచి పంపినట్లు బాధితులు చెప్పారు. తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపిస్తూ కోర్టులను మోసం చేస్తున్నట్లు, ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు వివరించారు.

ప్రభుత్వ చర్యల కోసం వినతి:

ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ చైర్మన్‌తో పాటు, జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్‌కు కూడా వినతిపత్రం ఇచ్చారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే న్యాయ సహాయం కల్పించాలని డిమాండ్ చేశారు.

23 Jul 2025

Leave a Comment