మెదక్, 10 సెప్టెంబర్ 2025
స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాలోజి నారాయణరావు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) భుజంగరావు పేర్కొన్నారు.
కాలోజి జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు మాట్లాడుతూ, కాలోజి గారి వ్యక్తిత్వం, రచనలు ప్రజాస్వామ్యానికి, నైతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపమని కొనియాడారు.
“యువత కాలోజి ఆలోచనల నుంచి ప్రేరణ పొందాలి,” అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అవిన్యాస అధికారి యూనస్‌తో పాటు ఇతర సంబంధిత అధికారులు పాల్గొని, కళోజి గారికి స్మరణాంజలి ఘటించారు.






