తెలంగాణలో కొనసాగుతున్న కాలేజీల బంద్……

On: Friday, November 7, 2025 3:52 PM

 

హైదరాబాద్:నవంబర్ 07

తెలంగాణలో రాష్ట్రంలో ప్రైవేటు ఉన్నత విద్యాసం స్థల బంద్ కొనసాగుతుంది. ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కొనసాగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటూ ప్రభుత్వం అటూ ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యాలు పట్టువీడకపోవడంతో అర్ధాంతరంగా చర్చలు ముగిశాయి.

మరో వైపు ఆందోళనను ఉధృతం చేసేందుకు ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. 2వేలకు పైగా వృత్తివిద్యా కాలేజీలతో పాటు పీజీ, డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. కీలకమైన సెమిస్టర్ పరీక్షలను సైతం మెజార్టీ కాలేజీలు బహిష్కరించా యి.

గత నాలుగు రోజులుగా బంద్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిల్లో యాబై శాతం నిధులు ఇస్తే కానీ సమ్మె విరమించే ప్రశ్న లేదని స్పష్టం చేశాయి. మంగళవారం ప్రభుత్వం చర్చలకు పిలిచింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవ డంతో తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించాయి.

రేపు శనివారం ఎల్బీ స్టేడియంలో దాదాపు 30 వేల మంది అధ్యాపకులతో సాంత్వన సభ నిర్వహించేం దుకు సిద్ధమవుతున్నాయి.

07 Dec 2025

Leave a Comment