మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు…..

On: Friday, September 5, 2025 11:28 AM

 

ఎ9 న్యూస్ – మెదక్, సెప్టెంబర్ 5:

ముస్లిం సోదరులకు పవిత్ర మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఆర్. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “శాంతి, ప్రేమ, సహనం, త్యాగం, సేవ” మార్గంలో జీవించాలనే అల్లాహ్ సందేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ముహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు

అన్ని వర్గాల ప్రజలు పరస్పర సౌహార్ధంతో, సోదరభావంతో జీవించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

15 Mar 2026

Leave a Comment