ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

On: Monday, August 18, 2025 4:12 PM

 

ఈ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ | ఆగస్టు 18

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పై తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్ మరియు అనేక ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ విగ్రహం ద్వారా పాపన్న గౌడ్ మహారాజ్ గారి గొప్ప చరిత్రను తరాలకూ గుర్తు చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. బహుజన నాయకుల సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నదన్నరూ.

05 Feb 2026

Leave a Comment