కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ ఆరా..

On: Friday, July 4, 2025 10:37 AM

 

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రి వైద్యులు, అధికారులతో ఆయన మాట్లాడారు.

కేసీఆర్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

గురువారం సాయంత్రం స్వల్ప అనారోగ్యంతో కేసీఆర్‌ ఆస్పత్రిలో చేరారు. యశోద వైద్యులు ఆయనకు పలు పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌ వెంట సతీమణి శోభ, కేటీఆర్‌, హరీశ్‌రావు ఆస్పత్రికి వెళ్లారు.

23 Jul 2025

Leave a Comment