ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో బీజేపీ నాయకులు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.
వివిధ అనారోగ్యాలతో చికిత్సలు చేయించుకుంటున్న గ్రామంలోని దాదాపు 10 మందికి మొత్తం రూ.1,71,000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
సహాయ నిధి ద్వారా సహాయం అందించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు గంగోల్ల ప్రళయ్ తేజ్, బూత్ అధ్యక్షులు మచ్చర్ల అర్జీత్, అయిలి అరుణ్, బోడిగం నాగేష్, దినేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.







