చిన్న శంకరంపేట, సెప్టెంబర్ 17: తెలంగాణ వియోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్థూపం వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు పోగుల రాజు ఆధ్వర్యంలో పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఇందులో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రుద్రారం గ్రామంలోని సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, మోడీ గారి ఆరోగ్యానికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా నాయకులు మల్లారెడ్డి, సురేష్ గౌడ్, మూర్తి, శంకర్, అలాగే మండల నాయకులు సుదర్శన్, నరేందర్ రెడ్డి, మేడి శీను, ఆకుల రాజు, బాబు, మధు, గంగాధర్, స్వామి, రమేష్, గోపాల్, శివశంకర్, మహేష్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







