జీమెయిల్ పాస్‌వర్డ్ మార్చుకోండి: గూగుల్ హెచ్చరిక….

On: Monday, September 1, 2025 9:59 AM

 

250 కోట్ల ఖాతాలపై ప్రమాదం ముప్పు!

టెక్ దిగ్గజం గూగుల్ కీలక హెచ్చరిక జారీ చేసింది. జీమెయిల్ వినియోగదారులు తక్షణమే తమ పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచించింది. సైబర్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అప్రమత్తత చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని గూగుల్ పేర్కొంది.

గత జూన్ ప్రథమార్థంలో చోటుచేసుకున్న సేల్స్‌ఫోర్స్ డేటా లీక్ (బ్రీచ్) కారణంగా దాదాపు 250 కోట్ల ఖాతాల సమాచారం హ్యాకర్ల చెంతకు చేరినట్లు గూగుల్ వెల్లడించింది. మొదట అంచనా వేసిన దానికంటే ఈ డేటా తస్కరణ మరింత తీవ్రమైందని గూగుల్ స్పష్టం చేసింది.

ఇది గూగుల్ ఖాతాలకే కాకుండా, అనేక ఇతర సర్వీసులకు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా.

ఇదే సందర్భంలో గూగుల్ మరో కీలక హెచ్చరికను కూడా జారీ చేసింది. హ్యాకర్లు ప్రస్తుతం వినియోగదారులకు కాల్స్, మెసేజెస్ పంపిస్తూ, “మీ ఖాతా హ్యాక్ అయింది” అని చెప్పి పాస్‌వర్డ్‌లు, లాగిన్ కోడ్స్ కోరుతున్నట్లు గమనించారని తెలిపింది.

🔒 మీరు చేయాల్సిన చర్యలు:

వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి.

Two-Factor Authentication (2FA) ప్రారంభిం.

అనుమానాస్పద మెసేజులు, లింకులు క్లిక్ చేయవద్దు.

వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకండి.

🔔 సైబర్ భద్రత కోసం ప్రతి వినియోగదారుడూ అప్రమత్తంగా ఉండాలి.

 

15 Mar 2026

Leave a Comment