ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు, మున్నూరు కాపు సంఘం ఎదుట చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీ వాసుల రాకపోకలు సౌకర్యవంతంగా మారడంతో పాటు, ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభించింది.
ఈ సందర్భంగా పనులు సజావుగా పూర్తయ్యేందుకు సహకరించిన కాలనీ వాసులందరికీ 35వ వార్డు కౌన్సిలర్ సడక్ వినోద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతున్నామని, భవిష్యత్తులో కూడా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.








