గ్రామ దేవతలకు పిల్లుల బలి – మిర్ధాపల్లి లో కలకలం… 

On: Sunday, August 31, 2025 6:14 PM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మండలం మిర్ధాపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ దేవతల వద్ద నలుగు  పిల్లులను బలి ఇచ్చారు. వారిలో రెండు  పిల్లులను వినాయకుడి విగ్రహాల వద్ద కోసి రక్తాన్ని దేవతలపై చల్లిన ఘటన గ్రామంలో కలకలం రేపింది.

గ్రామ విడిసి అధ్యక్షులు ఏలేటి సాయిరెడ్డి, డికొండ గంగాధర్ మాట్లాడుతూ:

“గ్రామ దేవతలకు, గణపతులకు పిల్లులను బలి ఇవ్వడం దురదృష్టకరమైన పిరికి చర్య. ఇలాంటి పనులు గ్రామానికి అనర్థాలను తెస్తాయి. ఎవరికైనా ఆపత్కాలం వస్తే తమ ఇళ్లలో లేదా వాగు వంకల వద్ద పూజలు చేసుకోవచ్చు గాని గ్రామ దేవతల వద్ద బలి ఇవ్వడం సరికాదు” అని ఖండించారు.

దుంపల భాస్కర్ మాట్లాడుతూ:

“ప్రతి ఆదివారం ఆలయ ప్రాంగణంలో చెత్త చెదరాన్ని శుభ్రం చేస్తుంటాం. ఈ ఉదయం వచ్చేసరికి పిల్లులను కోసి దేవతలకు బలి ఇచ్చిన దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాం. వెంటనే ఈ విషయాన్ని గ్రామ వీడీసీకి సమాచారం ఇచ్చాం” అని తెలిపారు.

గ్రామాన్ని సందర్శించిన ఎస్‌ఐ రమేష్ మాట్లాడుతూ:

“గ్రామస్థులను అడిగి ఘటనపై సమాచారం సేకరించాం. పిల్లులను గ్రామ దేవతలకు బలిచ్చిన వ్యక్తులను త్వరలో పట్టుకుంటాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మారంపల్లి మైపాల్, బసకొండ మల్లయ్య, మేర లింబాద్రి, మోదొల్ల పెంటన్న, కళ్లెం సాయిరెడ్డి, తుమ్మల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

15 Mar 2026

Leave a Comment