ఆర్మూర్‌లో కార్టెన్ సెర్చ్…..

On: Saturday, July 5, 2025 10:16 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ప్రజల రక్షణకు మరియు శాంతి భద్రతల పరిరక్షణకు చర్యల భాగంగా ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్‌నగర్ కాలనీలో కార్టెన్ సెర్చ్‌ నిర్వహించినట్టు డివిజన్ పోలీస్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం పోలీసులు ఇంటింటికి వెళ్లి ఇంటి యజమానులు, కిరాయిదారుల ఆధార్ కార్డులు పరిశీలించారు.

గుర్తు తెలియని వ్యక్తులకు ఇల్లు అద్దెకు ఇవ్వకూడదని అధికారులు హెచ్చరించారు. అలాగే నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహన యజమానులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలు చూపిన అనంతరం వాటిని తిరిగి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.

మొదటి నుంచి మైనర్ బాలురకు వాహనాలు అప్పగించడాన్ని నిషేధిస్తూ, అలాంటి పరిస్థితుల్లో యజమానులపై కేసులు నమోదవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు తమ బాధ్యతగా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

22 Jul 2025

Leave a Comment