Feb 03, 2026,
తెలంగాణ : రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ షేర్ చేసిన ఒక షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతివేగం, నిర్లక్ష్యం ఎంతటి ఘోరాలకు దారితీస్తాయో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. “మీ చిన్న అజాగ్రత్త ఎదుటివారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతుంది.. బాధ్యతగా వాహనాలు నడపండి” అని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలను కోరారు.








