డిపో అధికారులకు వినతి…
ఆర్మూర్:
బాద్గుణ, ఉమ్మేడ , మాయపూర్,గ్రామాలకు తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్మూర్, నిజామాబాద్ ఆర్టీసీ బస్సు డిపోల డీఎం, రీజినల్ మేనేజర్లకు గ్రామ ప్రజాప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్మూర్ నుండి నైట్ బస్సు, నిజామాబాద్ నుండి రోజుకు రెండు ట్రిప్పులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే
ఉమ్మేడ గ్రామానికి లోపలికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
ఈ వినతి పత్రాన్ని బాద్గుణ సర్పంచ్ చెలిమేలా స్వప్న సుధన్, ఉమ్మేడ సర్పంచ్ జై భోజందర్, మాయపూర్ సర్పంచ్ జీవన్, బాద్గుణ ఉప సర్పంచ్ శివ, గంగాధర్, ఓంకార్ తదితరులు కలిసి అందజేశారు.
గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.








