కవితపై బిఆర్ఎస్ కఠిన నిర్ణయం – పార్టీ నుంచి సస్పెన్షన్…..

On: Tuesday, September 2, 2025 7:05 PM

 

A9 న్యూస్ హైదరాబాద్‌:

బిఆర్ఎస్‌లో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్‌ చేసింది. క్రమశిక్షణ కమిటీ నేరుగా తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ లోపల, బయట చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం అయినప్పటి నుంచే కవితపై చర్యలు తప్పవని ప్రచారం సాగింది. అయితే ఇప్పటివరకు కేసీఆర్ నిశ్శబ్దం పాటిస్తూ నిర్ణయాన్ని వాయిదా వేసినట్టుగా కనిపించారు. కవిత హరీష్ రావు, సంతోష్‌లపై నేరుగా విమర్శలు చేయడంతో పరిస్థితి క్లిష్టమైపోయింది.

పార్టీ శ్రేణులలో హరీష్ రావును అవమానించినట్లయితే, ఉద్యమం నుంచి అండగా ఉన్న నేతను విస్మరించినట్లవుతుందనే భావన కలిగింది. దీంతో క్రమశిక్షణ కమిటీ తక్షణ చర్యకు దిగింది. ఈ నిర్ణయం వల్ల హరీష్ రావు పరువు నిలిచిందని, పార్టీ బరువు దించుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కవితపై తక్షణ సస్పెన్షన్‌ నిర్ణయం కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు మరింత బహిర్గతం చేసినట్టేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. “ఇక కల్వకుంట్ల కుటుంబం రెండుగా విడిపోయింది” అన్న అభిప్రాయాలు తెరపైకి రావడం విశేషం.

02 Sep 2025

Leave a Comment