ఈ9 న్యూస్ | మాసాయిపేట | ఫిబ్రవరి 1:
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అక్రమ కేసులు బనాయిస్తూ, సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఒత్తిడి చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.
మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొని నినాదాలు చేశారు.








