నవవధువు ఆత్మహత్య – కల్లేడి గ్రామంలో విషాదం….

On: Sunday, April 5, 2026 7:35 AM

 

A9 న్యూస్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లేడి గ్రామంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాన్సువాడకు చెందిన నవవధువు అఖిల (30) ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. గత నెల మార్చి 5వ తేదీన కల్లేడి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో అఖిలకు వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే ఈ దుర్ఘటన జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం ఉదయం భర్త పని నిమిత్తం నిర్మల్‌లోని మెడికల్ షాప్‌కు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేని వేళ అఖిల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఆమె మృతి చెందింది. ఇటీవల అఖిల తన తల్లిదండ్రుల గ్రామమైన బాన్సువాడకు వెళ్లి, శుక్రవారం రోజున తిరిగి కల్లేడి గ్రామానికి చేరుకుంది. ఆ తరువాత కొద్ది గంటల్లోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

05 Apr 2026

Leave a Comment