బ్రేకింగ్ న్యూస్ – ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం ప్రయాణంలో కీలక దశ…..

On: Thursday, December 4, 2025 8:28 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

మహాబలిపురం ➜ ఆర్మూర్ ➜ బీహార్ విరాట్ రామాయణ ఆలయం.

ప్రపంచంలోనే ఎత్తైన 33 అడుగుల, 210 టన్నుల గ్రానైట్ శివలింగం మహాబలిపురం నుంచి బీహార్ రాష్ట్రంలోని విరాట్ రామాయణ ఆలయం వైపు బయలుదేరి ఇవాళితో 12 రోజులు పూర్తయ్యాయి. సుమారు 13 కోట్ల రూపాయల వ్యయంతో, దశాబ్ద కాలం శ్రమతో చెక్కిన ఈ మహద్భవమైన శివలింగం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వరకు చేరింది.

ఈ భారీ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొంచిన 96 చక్రాల మెగా ట్రైలర్‌లో రవాణా చేస్తుండగా… రోజుకి కేవలం 40–50 కిలోమీటర్లే ప్రయాణం జరుగుతోంది. మార్గమంతా భద్రత కోసం వేర్వేరు రాష్ట్రాల పోలీసులు, ఇంజనీరింగ్ బృందాలు సహకరిస్తున్నాయి.

రవాణా బాధ్యతలు చూసే అధికారులు తెలిపారు.

“ఇంకా సుమారు 20 రోజులు ప్రయాణం కొనసాగుతుంది. రోడ్డు పరిస్థితులు, అనుమతులు, సురక్షిత వేగం, బీహార్ ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి ఇంత సమయం పడుతుంది” అని చెప్పారు.

శివరాత్రికి ముందు శివలింగం సంస్థాపన పూర్తిచేయాలనే లక్ష్యంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.

భారతీయ శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ శివలింగం యాత్ర దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఆసక్తిని రేకెత్తిస్తోంది.

04 Mar 2026

Leave a Comment