ఆర్మూర్‌లో సాయి వోకేషనల్ కాలేజ్‌లో బోనాల పండుగ…

On: Tuesday, July 22, 2025 6:14 AM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సాయి వోకేషనల్ జూనియర్ కాలేజీలో బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు సంప్రదాయంగా బోనాలను తయారుచేసి, ప్రత్యేకంగా అలంకరించి, పాటలు పాడుతూ కళాశాల ఆవరణలో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు యాజమాన్యం పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈవిధంగా పాఠశాల స్థాయిలో జరుపుకొంటున్న సాంస్కృతిక ఉత్సవాలు విద్యార్థుల్లో సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంలో దోహదపడతాయని వారు తెలిపారు.

22 Jul 2025

Leave a Comment