అమ్మవారికి ఆది బోనం,
ఆర్గుల్ గ్రామంలో మాజీ సర్పంచ్ గొర్త రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు,తెలంగాణ సంస్కృతి, ఆచార సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్గుల్ గ్రామంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో గ్రామ ప్రజలు అందరూ భారీ ఎత్తున తరలి వచ్చారని వారు అన్నారు,ఈ సంవత్సరం తెలంగాణ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు అద్భుతంగా పండాలని ప్రతి ఒక్కరు అమ్మ వారికి మొక్కుతూ అమ్మ వారి ఆశీర్వాదం తీసుకున్నారని, రాబోయే రోజులల్లో కుడా ఈ బోనాల పండుగని ప్రజలందరూ ఇంకా గొప్పగా ఈ సంప్రదాయాలని కొనసాగించాలని వారు కోరారు,
ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఒక్కరు పాల్గొన్నారు.
సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ఆనవాయితీ అని గొర్త రాజేందర్ తెలిపారు….