ఇందల్వాయి మండలం, సెప్టెంబర్ 9 (A9 న్యూస్):
ఇందల్వాయి మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామంలో వలస వచ్చిన సూర్యనారాయణ అనే వ్యక్తి కుళ్లిపోయిన స్థితిలో మృతి చెంది ఉన్నారు. ఆయన కొడుకు రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, గత 6 సంవత్సరాలుగా ఆయన తిర్మన్‌పల్లిలో మేస్త్రిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా రమేష్ తన భార్యతో కలిసి స్వగ్రామమైన ప్రకాశం జిల్లా బద్దిమడుగుకు వెళ్లినట్లు తెలిపారు. 12 రోజుల తర్వాత తిరిగి వచ్చి తలుపు తెరిచిన సమయంలో సూర్యనారాయణ మృతదేహం మంచంపై కుళ్లిపోయిన స్థితిలో కనిపించిందని చెప్పారు.
మృతుడి కుమారుడు రమేష్ ప్రకారం, సూర్యనారాయణ అనారోగ్యం కారణంగా మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఈ మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని కూడా వెల్లడించారు.
సూచనల మేరకు ఎస్సై సందీప్ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.







