ఆశీర్వదించండి – అభివృద్ధి చేసి చూపిస్తా…

On: Sunday, February 8, 2026 6:49 AM

పాలకుడిని కాదు… మీ సేవకుడిని!

ఆశీర్వదించండి – అభివృద్ధి చేసి చూపిస్తా…

పని చేసేవాడు సేవకుడు,

పని చేయించేవాడు పాలకుడు,

పని చేస్తూ… చేయించేవాడు నిజమైన నాయకుడు.

ఆ సేవా భావంతోనే మీ ముందుకు వస్తున్నాను.

శ్రీమతి శేర్ల మమత గంగాధర్ గౌడ్ (గంగూలి)

ఆర్మూర్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని

👉 మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి

👉 6వ వార్డు కౌన్సిలర్‌గా గెలిపించండి

మన 6వ వార్డు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి,

రాబోయే రోజుల్లో ఆదర్శవంతమైన, సురక్షితమైన, సుందరమైన వార్డుగా తీర్చిదిద్దాలనే ఆశతో కాదు – ఆశయంతో మీ ముందుకు వస్తున్నాను.

మీ అందరి మధ్యే పెరిగిన వ్యక్తిగా,

మీ కష్టాలు నాకు తెలుసు…

మీ సమస్యలే నా బాధ్యత.

అధికారం కోసం కాదు… అభివృద్ధిలో భాగస్వామి కావడానికి

నాకు ఒక అవకాశం ఇవ్వండి.

నా హామీలు – నా మాట కాదు, నా బాధ్యత

• వార్డులో ఎక్కడ ఇబ్బంది ఉన్నా సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణం చేయిస్తాను.

• ప్రధాన రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయిస్తాను.

• వార్డులోని స్మశానవాటికలను అభివృద్ధి చేసి, వైకుంఠ ధామాల నిర్మాణం చేయిస్తాను.

• గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి ఇప్పటికే ఇచ్చింది. ఇంకా ఎవరు అర్హులు ఉంటే వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తాను.

• కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి వార్డులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును తొలగించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తాను.

• ఏ సమస్య వచ్చినా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, మీ కష్టాల్లో భాగస్వామిని అవుతాను.

మీ అమూల్యమైన ఓటుతో

అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నా వినమ్ర ప్రార్థన

చేతి గుర్తుకు ఓటు వేయండి – అభివృద్ధిని గెలిపించండి ✋

మీ సేవకురాలు,

శేర్ల మమత గంగాధర్ గౌడ్ (గంగూలి)

6వ వార్డు – ఆర్మూర్ మున్సిపాలిటీ

05 Mar 2026

Leave a Comment