బీజేపీ అధిష్టానం నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాం.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌

On: Monday, June 30, 2025 4:33 PM

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా అధిష్టానం ఎవ‌రినీ ఎంపిక చేసినా తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధ‌ర్మ‌పురి(MP Arvind Dharmapuri) స్ప‌ష్టం చేశారు. అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఎన్నికైనా క‌లిసి ప‌ని చేస్తామ‌ని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ క‌ర్త‌వ్య‌మ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌(Hyderabad)లోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో అర్వింద్ సోమ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎవ‌రూ నామినేష‌న్ వేసినా మ‌ద్ద‌తిస్తామ‌ని చెప్పారు. అధిష్టానం ఆదేశాల మేర‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎవ‌రూ ఎన్నికైనా అంతా క‌లిసే ప‌ని చేస్తామ‌ని అన్నారు. ఈ విషయంలో రెండో మాటే లేద‌న్నారు.

MP Arvind | అర్వింద్‌ను కాద‌ని కొత్త వ్య‌క్తికి..

బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా అర్వింద్ నియ‌మ‌తుల‌వుతార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అధిష్టానం ఆయ‌న పేరును సీరియ‌స్‌గా ప‌రిశ‌లిస్తోందన్న వార్త‌లొచ్చాయి. అర్వింద్‌కు, మ‌రో ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌(MP Eatala Rajender)కు మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. అయితే, బీజేపీ హైక‌మాండ్(BJP Highcommand) అనూహ్యంగా మ‌రో వ్య‌క్తిని తెర‌పైకి తీసుకొచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్‌రావు(Former MLC Ramchandra Rao) పేరును ఖ‌రారు చేసింది. ఈ నేప‌థ్యంలో అర్వింద్ చిన్న‌బోయార‌న్న వార్త‌లు రాగా, ఆయ‌న వాటిని ఖండించారు. హైకమాండ్ తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటానని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధ్య‌క్షుడిగా ఎవ‌రూ ఎన్నికైనా క‌లిసి ప‌ని చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డానికి, పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేస్తామ‌ని చెప్పారు.

https://twitter.com/i/status/1939603724189811014
21 Jul 2025

Leave a Comment