భారీ వర్షాల కాటుకు భీమ్‌గల్ ఎక్సైజ్ కార్యాలయం బలి..

On: Thursday, August 28, 2025 7:57 PM

 

A9 న్యూస్ ప్రతినిధి భీమ్‌గల్:

కప్పల వాగు నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో భీమ్‌గల్ ఎక్సైజ్ కార్యాలయం మునిగిపోయింది. నీరు కార్యాలయంలోకి చేరడంతో ఇద్దరు ఉద్యోగులు – గంగాధర్, సికిందర్ లోపలే చిక్కుకుపోయారు. ఆకస్మిక వరద నీటితో బయటకు రాలేకపోయిన వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని అంచనా వేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులు కోరుతున్నారు.

13 Mar 2026

Leave a Comment