బోధించు – సమీకరించు – పోరాడు…
ఎ9 న్యూస్, మెదక్ – మార్చి 8
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ గారిని బహుజన్ సమాజ్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు నాగులూరి స్వామిదాస్ గారు మరియు జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలో వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు సహాయ సహకారాలు అందించాలని నాయకులు కలెక్టర్ గారిని కోరారు.
దీనికి స్పందించిన కలెక్టర్ ప్రతిమ సింగ్ గారు, ప్రజల సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే తప్పకుండా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎర్ర శంకర్, వై ఆనంద్ కుమార్, జై ఆశిష్ కుమార్, మేకల మధు, సిద్ధోషి దత్తు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.







