షేక్ షబ్బీర్‌కు ప్రశంస పత్రం ప్రదానం.
ఆర్మూర్, ఆగస్టు 15 (A9 న్యూస్ ప్రతినిధి):
ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా సేవలందిస్తున్న షేక్ షబ్బీర్‌కు ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు లభించింది. ఆయనకు ఉత్తమ ఉద్యోగి అవార్డుగా ప్రశంస పత్రం అందజేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్, నిజామాబాద్లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ ఆర్. కృష్ణయ్య నిరంజన్ చేతుల మీదుగా షబ్బీర్ ఈ ప్రశంస పత్రాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
షబ్బీర్‌కు ఈ అవార్డు లభించడం పట్ల సహోద్యోగులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన విధినిష్ఠ, సమయపాలన, ప్రజాసేవ పట్ల చూపిన నిబద్ధత ఈ గుర్తింపుకు దోహదం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.







