రైతుల బాధలు తెలుసుకొని నీటిని విడుదల చేయాలి రాజిరెడ్డి విజ్ఞప్తి.
ఎ9 న్యూస్, మెదక్, జూలై 19:
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో కలసి, సాగునీటి సమస్యలపై వినతి పత్రం, అందజేశారు.ఈ వినతి పత్రంలో కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి హల్దీ వాగు ద్వారా వెల్దుర్తి, మాసాయిపేట్, కొల్చారం మండలాలకు, అలాగే సింగూరు రిజర్వాయర్ నుంచి కొల్చారం మండలంలోని సాగు భూములకు తక్షణం నీటిని విడుదల చేయాలనీ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, ఆయా ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేయడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు.