మీడియా సంస్థలపై, మీడియా ప్రతినిధులపై, అమాయక ప్రజలపై దాడులు, బెదిరింపులు చేశారో…
వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించే పార్టీ బీజేపీ.
హైదరాబాద్, జులై 7: మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ దాడులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై బీఆర్ఎస్ మూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసుల నంచి సమాచారం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. ప్రజలు ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదన్నారు. మీడియా సంస్థలపై గులాబీ శ్రేణుల దాడులు దుర్మార్గమని వ్యాఖ్యలు చేశారు. మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థలకు రక్షణ కల్పించాలని బీజేవైఎం కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా తప్పుగా రాస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
*బీఆర్‌ఎస్ నేతలకు హెచ్చరిక….
ఇకపై మీడియా సంస్థలపై, మీడియా ప్రతినిధులపై, అమాయక ప్రజలపై దాడులు, బెదిరింపులు చేశారో ఖబడ్దార్.. అంతు చూస్తామని హెచ్చరించారు. మీడియా సంస్థలను బీజేపీ గౌరవిస్తోందన్నారు. తమకు వ్యతిరేకంగా రాసినా, కథనాలు ప్రచారం చేసినా తప్పులుంటే సరిదిద్దుకుంటామని తెలిపారు. వార్తలపై అభ్యంతరాలు ఉంటే ఇతర పద్ధతుల ద్వారా కండనలు ప్రతిస్పందనలు ఇవ్వవచ్చని అలా ముందుకు వెళతామే తప్ప దాడులు చేయబోమని చెప్పారు. ఎందుకంటే వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ‘మీడియా సంస్థలపై దాడులు చేశారో ఖబడ్దార్… టీ న్యూస్ అంతు చూస్తాం’ అంటూ బీఆర్‌ఎస్ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వార్నింగ్ ఇచ్చారు..