A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన గొల్ల గంగాధర్ (46), అనే వ్యక్తి తన ఇంటి ముందు మంచంపై నిద్రిస్తున్న సమయంలో, తలపై తెలియని పదునైన మానాయుధంతో దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై మృతుడి చెల్లెలు అంజలి ఫిర్యాదు చేస్తూ, తమ పెద్దన్నను తమ చిన్నన్న, గొల్ల గంగాధర్ (తమ్ముడు) హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు–తమ్ముడు మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని, అనేకసార్లు పంచాయతీలు కూడా జరిగినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసుకొని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవపంచనామా నిర్వహించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం పరీక్ష పూర్తయ్యాక బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.






