హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రూ.18వేలు లంచం అడిగి.. నేడు రూ.8వేలు తీసుకుంటుండగా అసిస్టెంట్ ఇంజినీర్ రమేశ్ ఏసీకి పట్టుబడ్డారు. గతంలో రూ.10వేలు తీసుకున్నట్లు సమాచారం. జనగామ డీఈవో ఆఫీస్లో రమేశ్ పని చేస్తున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..