*మచ్చర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాగోతుల లింగవ్వ….
*బీద కుటుంబం నుంచి వచ్చిన మహిళా శక్తికి ప్రతీక….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
గ్రామపంచాయతీ ఎన్నికలలో మచ్చర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాగోతుల లింగవ్వ కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్నారు. తనను గెలిపిస్తే మచ్చర్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మీలో ఒక్కరిగా ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు.
“ఓటు మీది – మన గ్రామ అభివృద్ధి నాది” అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన బాగోతుల లింగవ్వ
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మహిళల్లో ఉన్న ఉత్సాహాన్ని మరింత ప్రేరేపిస్తూ, మహిళా శక్తికి ప్రతీకగా, మీ ఇంటి ఆడబిడ్డగా మచ్చర్ల గ్రామ సర్పంచ్‌గా సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.
తాను బీద కుటుంబానికి చెందిన వ్యక్తినని, ఇప్పటికీ కిరాయి ఇంటిలో నివసిస్తూ, ఎన్నికలలో పోటీ చేస్తున్నానని తెలిసిన నాటి నుంచే
తన గ్రామస్తులే ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచి ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. తన ఎన్నికల గుర్తు నుంచి ప్రచారం వరకు అన్నింటిలోనూ గ్రామస్తులే తన బలం అని పేర్కొన్నారు.
తనను గెలిపిస్తే జిల్లాలోనే ఒక బీద కుటుంబానికి చెందిన మహిళ సర్పంచ్‌గా గెలిచిన గ్రామంగా మచ్చర్లకు మంచి పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికలలో పోటీ చేయడానికి తన ముఖ్య ఉద్దేశం కుల–మత భేదాలు లేకుండా, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారు పొందుపరిచిన సమాన హక్కులను అందరికీ కల్పించాలనే సంకల్పమేనని స్పష్టం చేశారు. ఎక్కువ -తక్కువ అనే తేడా లేకుండా అందరినీ సమానంగా కలుపుకొని గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
డా. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతోనే తాను ఎన్నికల బరిలో నిలిచానని బాగోతుల లింగవ్వ తెలిపారు.
డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా, నిజాయితీతో, స్వచ్ఛమైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, ఒక బీద కుటుంబానికి చెందిన మహిళకు, అలాగే డా. అంబేద్కర్ కి బహుమతిగా ఈ విజయాన్ని అందించాలని మచ్చర్ల గ్రామ ప్రజలను ఆమె హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మచ్చర్ల గ్రామ ప్రజలందరికీ తన యొక్క వినయపూర్వక పాదాభివందనాలు తెలిపారు.







