ఆర్మూర్ బస్టాండ్ విజిలెన్స్ కానిస్టేబుల్ రాజశేఖర్‌కు ఉత్తమ సేవా అవార్డు….

On: Sunday, February 8, 2026 10:26 AM

 

నిజామాబాద్/ఆర్మూర్:

ఆర్మూర్ బస్టాండ్‌లో విధులు నిర్వహిస్తున్న విజిలెన్స్ కానిస్టేబుల్ రాజశేఖర్‌కు ఉత్తమ సేవలందించినందుకు టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ డిపో తరపున ఉత్తమ అవార్డు ప్రశంస పత్రం అందజేశారు.

బస్టాండ్‌లో దొంగతనాలను అరికట్టడంలో, రద్దీని నియంత్రించడంలో రాజశేఖర్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ ప్రయాణికులకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు, కళాశాల విద్యార్థినులను ఆకతాయిల నుంచి రక్షిస్తూ వారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

అలసటలేని సేవలతో బస్టాండ్‌లో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహిస్తున్నందుకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తించి ఉత్తమ అవార్డు ప్రశంస పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొని రాజశేఖర్‌ను అభినందించారు.

05 Mar 2026

Leave a Comment