ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్ కు యాప్: తుమ్మల…

On: Wednesday, January 21, 2026 11:26 AM

 

Jan 21, 2026,

తెలంగాణ : రైతులు యూరియాను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా తీసుకొచ్చిన యూరియా యాప్‌ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్‌ను ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్నామన్నారు. కేంద్రం ఈ విధానాన్ని మెచ్చుకుందన్నారు. నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో చలామణి అవుతున్న ఫేక్ ప్రొడక్ట్స్ కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేలా ఓ యాప్‌ను కూడా తీసుకొస్తామని చెప్పారు. దీంతో పంటను ఎక్కడ, ఎలా పండించారనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

05 Feb 2026

Leave a Comment