రైతుల సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం తప్ప…

On: Thursday, July 24, 2025 6:12 PM

 

గేటు వద్దనే ఆపడం ఎంతవరకు సమంజసం

A9 న్యూస్ డెస్క్ ,జూలై 24:

భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా గురువారం నాడు నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లో ఏవో కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దనే కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి తో పాటు రైతు నాయకుల్ని గేటు వద్దనే నిర్బంధించినారు.దీనితో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గేటు ముందు కూర్చోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జిల్లా సిపి తో రైతులకు జరుగుతున్న బాధని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామంటే గేటు వద్దనే ఆపడం ఎంత వరకు సమంజసం అని సిపి ని అడగడం జరిగింది. అక్కడనే రాష్ట్ర ప్రభుత్వ రైతాంగం పై ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం తగదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది .ఇప్పటికైనా వరంగల్లో రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి చిట్టి భజన గంగారెడ్డి, నరసయ్య, నగేష్, హరీష్ రెడ్డి,  రైతు నాయకులు పాల్గొన్నారు.

26 Jul 2025

Leave a Comment