మెదక్ జిల్లా ఆర్.చందాపూర్‌లో సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివ స్వాముల అన్నదాన సేవ కార్యక్రమం…..

On: Saturday, February 14, 2026 3:32 PM

మెదక్ జిల్లా, చిన్న శంకంపేట్ మండలం, ఆర్. చందాపూర్ గ్రామంలోని సంగమేశ్వర స్వామి దేవాలయం లో శివ స్వాములు విరుముడు ఈ రోజు బయలుదేరుతున్న సందర్భంగా విశేషమైన అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు. భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసిన ఈ అన్నదానంలో అందరికీ ప్రసాదంగా అన్నం వడ్డించి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అన్నదానం అనంతరం శివ స్వాములు భక్తుల ఆశీర్వాదాలతో, హారతుల మధ్య తమ తదుపరి ప్రయాణానికి బయలుదేరారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించి, భక్తుల్లో ఆనందాన్ని నింపింది.

14 Feb 2026

Leave a Comment