ఆర్మూర్‌లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి – కమిషనర్ రాజు…..

On: Thursday, September 4, 2025 6:30 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

గణేష్ నవరాత్రులు 9–11 రోజుల పూజల అనంతరం జరగబోయే నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వివరాలు తెలియజేశారు.

ప్రధాన ఏర్పాట్లు:

రూ.15 లక్షలతో మొరం పనులు – నిమజ్జన మార్గాలపై చనువు కల్పన రూ.5 లక్షలతో లైటింగ్లు, మరమ్మతులు 4 చెరువులు, 5 క్రేన్లు – గుండ్ల చెరువు వద్ద 3, మామిడిపల్లి, కొటార్పూర్, పెర్కిట్ చెరువుల వద్ద ఒక్కొక్కటి 20 మంది గజ ఈతగాళ్లు – గుండ్ల చెరువులో భక్తుల రక్షణ కోసం ప్రతి చెరువులో టెంట్లు, మంచినీరు, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, సిసి కెమెరాలు ఏర్పాటు

గుండ్ల చెరువు వద్ద చిన్న విగ్రహాల నిమజ్జనానికి 15 అడుగుల వైర్ క్రేన్, భారీ విగ్రహాలకు 25 అడుగుల వైర్‌తో రెండు క్రేన్లు సిద్ధం చేశారు. మిగతా మూడు చెరువుల వద్ద కూడా క్రేన్లు, గజ ఈతగాళ్లను నియమించారు.

36 వార్డులకు 4 చెరువులు:

మొత్తం 36 వార్డుల భక్తుల కోసం ఈ 4 చెరువులు కేటాయించామని కమిషనర్ రాజు తెలిపారు. చిన్న–పెద్ద విగ్రహాలకు తేడా లేకుండా భక్తులు తమకు సౌకర్యం ఉన్న చెరువులో నిమజ్జనం చేసుకోవచ్చన్నారు.

కమిషనర్ సూచనలు:

“పోలీసుల సూచనలు పాటించాలి. సమయపాలనతో ఒకరి వెనుక ఒకరు వెళ్లాలి. ఇతర భక్తులకు ఇబ్బందులు కలగకుండా అందరూ శాంతియుతంగా పాల్గొనాలి” అని రాజు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

15 Mar 2026

Leave a Comment